‘సర్దార్ గబ్బర్ సింగ్’ కి స్పెషల్ విషెస్ చెప్పిన ‘బ్రూస్ లీ’

‘సర్దార్ గబ్బర్ సింగ్’ కి స్పెషల్ విషెస్ చెప్పిన ‘బ్రూస్ లీ’

Published on Sep 2, 2015 10:55 AM IST

Pawan-Kalyan-Ram-Chrana
టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగా హీరోలు అంతా తన సినిమా టీజర్స్ తో పవన్ కళ్యాణ్ కి విషెస్ చెప్పారు. నిన్న వరుణ్ తేజ్ ‘కంచె’ ట్రైలర్ తో పవన్ కళ్యాణ్ కి విషెస్ చెబితే, ఈ రోజు ఉదయం 8 గంటలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన సినిమా ‘బ్రూస్ లీ’ టీజర్ తో పవన్ కళ్యాణ్ కి విషెస్ చెప్పాడు. బ్రూస్ లీ న్యూ టీజర్ కూడా అభిమానులను మెప్పిస్తోంది.

‘బ్రూస్ లీ’ మొదటి టీజర్ ని ఫుల్ యాక్షన్ ప్యాక్ షాట్స్ తో, చాలెంజింగ్ డైలాగ్స్ తో రిలీజ్ చేసారు. సెకండ్ టీజర్ ని మాత్రం దానికి పూర్తి ఆపోజిట్ గా కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ టీజర్ ప్రకారం ‘బ్రూస్ లీ’లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ కి సినిమాలో పెద్దపీట వేసినట్లు కనపడుతోంది. అలాగే ఈ మూవీలో మాస్ కి కావాల్సిన యాక్షన్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. టీజర్ లో తమన్ అందించిన మ్యూజిక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత.

కోసం ఇక్కడ క్లిక్ చేయండి టీజర్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు