ఉగాది రోజున బన్ని – బోయపాటిల సినిమా ముహూర్తం.

ఉగాది రోజున బన్ని – బోయపాటిల సినిమా ముహూర్తం.

Published on Mar 5, 2015 6:05 PM IST

boyapati_allu_arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే సినిమాకు ముహూర్తం కుదిరింది. మార్చి 21న ఉగాది రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నెలలో ప్రారంభిస్తారు. యాక్షన్ & స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు.

తన మొదటి సినిమా కథను బన్నికు వినిపించారు బోయపాటి. అదే రవితేజతో తీసిన ‘భద్ర’. ఆ తర్వాత నుండి వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ఇన్నాళ్ళకు ఈ వీరి కాంబినేషన్ సెట్ అయ్యింది.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ పూర్తయిన తర్వాత బోయపాటి సినిమా మొదలవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు