సచిన్ తో చేతులు కలిపిన మెగా హీరో !

సచిన్ తో చేతులు కలిపిన మెగా హీరో !

Published on Dec 9, 2016 2:00 AM IST

allu-arjun-selfie
మెగా హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా రంగంపైనే కాకుండా క్రీడా రంగంపైనా దృష్టి పెట్టాడు. బెంగుళూరుకు చెందిన బ్యాడ్మింటన్ టీమ్ బెంగుళూరు బ్లాస్టర్స్ లో కొంత భాగాన్ని కొనుగోలు చేసి సచిన్ తో పాటే ఆ జట్టు యాజమాన్యంలో భాగస్వామి అయ్యాడు. సచిన్, బన్నీలతో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, పారిశ్రామికవేత్త నింగడ్డ ప్రసాద్ తదితరులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు.

ఈ విషయాన్నే తెలుపుతూ బన్నీ సచిన్, గోపీచంద్ లతో ఉన్న ఒక సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇలాంటి గొప్ప ఆటగాళ్లతో కలిసి కేరళ బ్లాస్టర్స్ టీమ్ కు కో ఓనర్ గా ఉండటం ఆంమాదంగా ఉంది. ఇదే నా జీవితంలో అత్యుత్తమ సెల్ఫీ అంటూ ఎంత స్టార్ హీరో అయినా తాను సచిన్ కు అభిమానినే అని చెప్పకనే చెప్పాడు. ఇకపోతే సచిన్ లాంచ్ చేసిన ఈ లీగ్ 2017 జనవరి నుండి ఆరంభం కానుంది. ఇకపోతే బన్నీ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు