విజయవాడలో లాట్ మొబైల్స్ షో రూం లాంచ్ చేయనున్న బన్ని

విజయవాడలో లాట్ మొబైల్స్ షో రూం లాంచ్ చేయనున్న బన్ని

Published on Oct 20, 2014 8:00 AM IST

Alluarjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగానే కాకుండా చాలా బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేస్తున్నారు. అందులో ఒకటే లాట్ మొబైల్స్. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో లాట్ మొబైల్స్ కి సంబదించిన పలూ బ్రాంచ్ లను అల్లు అర్జున్ ప్రారంభించారు. ఇప్పుడు విజయవాడలో ఓ లాట్ మొబైల్ షో రూంని అల్లు అర్జున్ లాంచ్ చేయనున్నారు.

ఈ రోజు ఉదయం 10 గంటలకు అల్లు అర్జున్ విజయవాడలో హై స్టాండర్డ్స్ తో, అన్ని రకాల కొత్త మొబైల్స్ తో సరికొత్త లాట్ మొబైల్స్ షో రూంని అల్లు అర్జున్ లాంచ్ చేయనున్నారు. దీనికి సంబదించిన అన్ని కార్యక్రమాలు ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్నాయి. అల్లు అర్జున్ ప్రసతుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇది కాకుండా ‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి ఫస్ట్ లుక్ రెండు రోజుల ముందే విడుదలై సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు