పక్కా ప్లానింగ్ తో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా.

పక్కా ప్లానింగ్ తో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా.

Published on Aug 22, 2014 11:47 PM IST

allu-arjun-and-trivikram
‘జులాయి’ తర్వాత మరోసారి కలసి వర్క్ చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తమ కొత్త సినిమా కోసం పక్కా ప్లాన్ రెడీ చేశారు. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో ఏకకాలంలో విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఒక హీరోయిన్ గా సమంతను ఎంపిక చేసిన త్రివిక్రమ్ మరో ఇద్దరినీ వెతికే పనిలో ఉన్నారు.

ఆల్రెడీ మలయాళంలో అల్లు అర్జున్ కు అక్కడ స్టార్ హీరోల రేంజ్లో మార్కెట్ ఉంది. తాజాగా తమిళంపై దృష్టి పెడుతున్నాడు. మిగతా హీరోలు కూడా ఇతర భాషలపై దృష్టి పెడితే బాగుంటుందని టాలీవుడ్ ఎప్పటి నుండో కోరుకుంటుంది.

తమిళ హీరోలయిన రజినీకాంత్, విక్రమ్, సూర్య, కార్తి తదితర హీరోలు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు. తమిళ, తెలుగు భాషల అభిమానులు ఇష్టపడే కథలతో తమ సినిమాలు రూపొందిస్తూ బాక్సాఫీస్ వద్ద తమ మార్కెట్ రేంజ్ పెంచుకుంటున్నారు. ఒకవేళ సినిమా ఫలితం అటూ ఇటూగా ఉన్నా రెండు భాషలలో విడుదల కావడం వలన మొదటివారం కలెక్షన్స్ తో నిర్మాత గట్టున పడుతున్నాడు. భారి ప్లాప్ అయితే తప్ప పెద్దగా నష్టాలు రావడం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు