యాక్షన్ మోడ్ లోకి వెళ్లనున్న అల్లు అర్జున్ !

యాక్షన్ మోడ్ లోకి వెళ్లనున్న అల్లు అర్జున్ !

Published on Oct 29, 2017 10:03 AM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య’. దేశభక్తి నైపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని రచయిత వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఊటీ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నవంబర్ 5 నుండి కొత్త షెడ్యూల్ ను ప్రారంభిస్తున్నారు. ఈ షెడ్యూల్లో హెవీ యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తారట. ఇవి హై వోల్టేజ్ యాక్షన్ కంటెంట్ కలిగి సినిమాకే హైలేట్ గా నిలవనున్నాయని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతున్నారు.

నాగబాబు సమర్పణలో, శ్రీధర్ శిరీష, బన్నీవాసులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జంటగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ఈ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ఆర్మీ అధికారిగా కనిపించనున్న అల్లు అర్జున్ ఖచ్చితమైన లుక్ కోసం యూఎస్ ట్రైనర్ల వద్ద కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ వంటి సీనియర్ స్టార్ నటులు నటిస్తున్న ఈ ప్రాజెక్టుకు విశాల్ – శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు