‘బుట్ట బొమ్మా’ సాంగ్ ప్రభంజనం ఏకంగా 20 కోట్ల వ్యూస్.

‘బుట్ట బొమ్మా’ సాంగ్ ప్రభంజనం ఏకంగా 20 కోట్ల వ్యూస్.

Published on May 31, 2020 1:25 PM IST

యూట్యూబ్ లో అల వైకుంఠపురంలో సాంగ్స్ ప్రభంజనానికి అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. అల వైకుంఠపురంలో మూవీ విడుదలై దాదాపు నాలుగు నెలలు దాటిపోయింది. ఆ చిత్ర సాంగ్స్ మాత్రం ప్రజల మనసులలో నుండి బయటికి వెళ్లడం లేదు. కాగా అల వైకుంఠపురంలో సూపర్ హిట్ ఆల్బంలో బుట్ట బొమ్మా వీడియో సాంగ్ ఏకంగా 200 మిలియన్స్ వ్యూస్ కి చేరుకుంది. అంటే ఈ సాంగ్ ని యూట్యూబ్ లో 20 కోట్ల మంది వీక్షించారన్న మాట.

మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా, సింగర్ అర్మానీ మాలిక్ బుట్ట బొమ్మా సాంగ్ ని అద్భుతంగా పాడారు. బాలీవుడ్ లోని అనేక మంది సెలెబ్రిటీలు సైతం బుట్ట బొమ్మ సాంగ్ కి స్టెప్స్ వేయడం జరిగింది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురలో మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా, సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు