వరుణ్ తేజ్ సినిమాకు కెమెరా మెన్ ఫిక్స్ !

వరుణ్ తేజ్ సినిమాకు కెమెరా మెన్ ఫిక్స్ !

Published on Feb 23, 2018 8:00 PM IST

ఘాజీ తరువాత విరామం తీసుకున్న సంకల్ప్ రెడ్డి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మొదలు పెట్టడానిని రంగం సిద్దం చేస్తున్నాడు.స్పేస్ లో జరిగే కథాంశం గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఏప్రిల్ మూడో వారం నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం. సినిమాటోగ్రాఫర్ శేఖర్ ఈ సినిమాకు పని చెయ్యబోతున్నాడు. గతంలో శేఖర్ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు పని చేసారు.

సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్, సెట్స్ ఉండబోతున్నట్లు సమాచారం. ఘాజీ తరహాలోనే ఈ సినిమాను భారీగా తెరకెక్కించబోతున్నారు చిత్ర యూనిట్. టైటిల్, హీరోయిన్ ఈ చిత్రానికి ఖరారు కాలేదు. త్వరలో ఆ వివరాలు వెల్లడి కానున్నాయి. తొలిప్రేమ సినిమా తరువాత వరుణ్ తేజ్ డిఫరెంట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు