నయనతార శేఖర్ కమ్ముల టీంని ఇబ్బంది పెడుతోందా.?

నయనతార శేఖర్ కమ్ముల టీంని ఇబ్బంది పెడుతోందా.?

Published on Apr 24, 2014 8:39 AM IST

Nayanathara
టాలెంటెడ్ నటి నయనతారపై ఎప్పటి నుంచో ఒక కంప్లైంట్ ఉంది. నయనతార చాలా డెడికేషన్, టాలెంట్ ఉన్న నటి కానీ ప్రమోషనల్ విషయాల్లో మాత్రం పాల్గొనకుండా టీం ని ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల ఇండస్ట్రీ మంది బాధపడ్డారు.

ఇటీవలే జారిన ‘అనామిక’ ఆడియో లాంచ్ కార్యక్రమానికి కూడా ఆమె హాజరు కాలేదు. ఈ విషయంలో శేఖర్ కమ్ముల కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న ఏమిటంటే ఇంకా ఎన్ని రోజులు నయనతార ఇలానే బిహేవ్ చేస్తుంది మరియు ఇంకా ఎన్ని ప్రొడక్షన్ టీమ్స్ ని ఇబ్బందిపెడుతుంది?

ఇటీవలే ఇలాంటి కొన్ని కారణాల వల్ల డైరెక్టర్స్ అసోషియేషన్ ప్రకాష్ రాజ్ పై కోపంగా ఉన్నారు. దేన్నీ బట్టి ఇండస్ట్రీలో బాడ్ బెహేవియర్ ఉంటె ఎక్కువ కాలం నిలవరనేది తెలుస్తోంది. ఇక నుంచి అయినా నయనతార కేర్ తీసుకొని ఇండస్ట్రీ నుంచి పలు ఇబ్బందులు ఎదుర్కోదని ఆశిద్దాం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు