షో నిలిపివేసి కమల్ హాసన్ ను అరెస్ట్ చేయాలట !
Published on Jul 12, 2017 5:01 pm IST


ప్రస్తుతం కమల్ హాసన్ బిగ్ బాస్ తమిళ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షోకి కొత్త ఇబ్బంది వచ్చి పడింది. తమిళనాడుకు చెందిన హిందూ మక్కల్ కట్చచి వెంటనే షోను నిలిపివేసి కమల్ హాసన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక అందులో పాల్గొంటున్న ఓవియా, నమిత, గంజ కరుప్పులను కూడా లీగల్ గా అరెస్ట్ చేయాలని కేసు పెట్టారు.

అందులో పార్టిసిపెంట్స్ అసభ్యంగా మాట్లాడటమేగాక 75 శాతం అశ్లీలంగా కనిపిస్తున్నారని, అది తమిళ సంస్కృతిని అవమానించినట్టేనని, వాళ్ళ వలన తమిళుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, కాబట్టి షోను వెంటనే బ్యాన్ చేసి వాళ్ళను అరెస్ట్ చేయాలని పేర్కొన్నారు. ఎలాంటి వివాదానికైనా తనదైన శైలిలో సమాధానాలు చెప్పే కమల్ ఈ అంశంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

 
Like us on Facebook