మహేష్ ‘బ్రహ్మోత్సవం’లో నటించే అవకాశం మీ సొంతం.

మహేష్ ‘బ్రహ్మోత్సవం’లో నటించే అవకాశం మీ సొంతం.

Published on Mar 4, 2015 5:21 PM IST

Casting-Call
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 15 నుండి 50 సంవత్సరాల వయసు గల మేల్ & ఫిమేల్ ఆర్టిస్టుల కోసం కాస్టింగ్ కాల్ యాడ్ ఇచ్చారు. ఆసక్తి కలవారు పైన ఫోటోలో ఈ – మెయిల్ ఐడికి తమ ఫోటోలను పంపించవచ్చు.

‘బ్రహ్మోత్సవం’లో మహేష్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. వాటిని చిత్ర బృందం ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమాలో రావు రమేష్ కీలక పాత్రలో నటించనున్నారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు