సినీ ప్రముఖులు మెచ్చిన ‘భరత్ అనే నేను’ !
Published on Apr 22, 2018 12:10 am IST


మొదటి రోజే అభిమానులను మెప్పించి, ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలందుకున్న చిత్రం ‘భరత్ అనే నేను’. మహేష్ బాబు, కొరటాల శివల హిట్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ డే ఏపి, తెలంగాణల్లో రూ.22 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. రాజకీయ నేపథ్యంలో నడిచే కథ కావడం, ఫ్రస్టూట్మ్ సొసైటీలో నెలకొన్ని కొన్ని తీవ్రమైన సమస్యల్ని ప్రస్తావించడం, వాటికి పరిష్కారాలు కూడ చెప్పడంతో సినిమాపై సినీ ప్రముఖులు సైతం పొగడ్తలు కురిపిస్తున్నారు.

జక్కన్న రాజమౌళి కొరటాల శివ ఎఫర్ట్ ను, మహేష్ నటనను పొగడగా రకుల్ ప్రీస్ట్ ఇసన్గ్ మహేష్ బాబుగారు భరత్ పాత్రలో గొప్పగా నటించారని, సంగీత దర్శకుడు తమన్ అయితే పార్ట్ 2 తియ్యాలని సరదాగా డిమాండ్ చేశారు. అలాగే మెహర్ రమేష్, వెంకీ అట్లూరి, కళ్యాణ్ రామ్, నిఖిల్, సుబ్బరాజు, శశాంక్, శరత్ కుమార్, వంశీ పైడిపల్లి, శ్రీను వైట్ల, హరీష్ శంకర్ వంటి వారంతా సినిమా బాగుందంటూ ఆకాశానికెత్తేశారు.

 
Like us on Facebook