చైతు ‘లవ్ స్టోరీ’ ఆగష్టు నుండి ఫిల్మ్ సిటీలో ?

చైతు ‘లవ్ స్టోరీ’ ఆగష్టు నుండి ఫిల్మ్ సిటీలో ?

Published on Jul 5, 2020 10:44 PM IST

టాలీవుడ్ లో బలమైన ఎమోషనల్ కథలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. నాగచైతన్య హీరోగా.. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా.. పెట్టి క్రేజీ కాంబినేషన్ తో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఆగష్టు ఫస్ట్ వీక్ నుండి షూటింగ్ రెడీ కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు అన్నిటినీ షూట్ చేస్తారట. ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది.

కాగా ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పైగా శేఖర్ కమ్ముల ఎంచుకున్న కాస్ట్ కూడా ప్రాజెక్ట్ కు పెద్ద ఎస్సెట్ అయింది. ఇప్పటికే కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్స్ ఓపెన్ అయినా తరువాత ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అయితే శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత చేస్తోన్న ఈ సినిమా మరి తెలుగు ప్రేక్షకులను మళ్లీ ఫిదా చేస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు