‘ప్రేమమ్’ రీమేక్ పై కన్నేసిన చైతు..

‘ప్రేమమ్’ రీమేక్ పై కన్నేసిన చైతు..

Published on Aug 1, 2015 11:50 PM IST

Naga-Chaitanyas-first-look
ఈ ఏడాది మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘ప్రేమమ్’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా ‘ప్రేమమ్’ను యువ హీరో రామ్ తో రీమేక్ చేస్తే వర్కవుట్ అవుతుందని కొందరు భావించారు. కానీ అది కార్య రూపం దాల్చలేదు. దీంతో ‘ప్రేమమ్’ రీమేక్ చైతుతో చేయించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ అక్కినేని అందగాడికి ప్రేమకథలే హిట్లను అందించాయి. సరైన హిట్ లేక సతమతమవుతున్న చైతూ.. ‘ప్రేమమ్’ రీమేక్ తో హిట్ కొట్టి తీరాలని పట్టుబట్టి కూర్చున్నాడట.

అన్నపూర్న స్టూడియోస్ బ్యానర్ పైనే నిర్మించాలని భావించగా… ఈ సినిమాకి ‘కార్తికేయ’ సినిమాతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన యువదర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం తెలుగు ‘ప్రేమమ్’ స్క్రిప్టు పనులలో నిమఘ్నమై వున్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు