‘చక్కిలిగింత’ సెన్సార్ పూర్తయింది.

‘చక్కిలిగింత’ సెన్సార్ పూర్తయింది.

Published on Nov 26, 2014 2:51 PM IST

chakkiligintha
సుమంత్ అశ్విన్, రెహానా జంటగా నటించిన లవ్ ఎంటర్టైనర్ ‘చక్కిలిగింత’. నేడు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమా ‘యు/ఏ’ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

‘చక్కిలిగింత’ సినిమా ద్వారా రచయిత వేమారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇలవల ఫిల్మ్స్ సమర్పణలో మహీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సీహెచ్. నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవల ఈ సినిమాను నిర్మించారు. మిక్కీ జె.మేయర్‌ స్వరపరిచిన బాణీలు ఇటివలే విడుదలయి శ్రోతలను అలరిస్తున్నాయి.

‘అంతకు ముందు ఆ తర్వాత’, ‘లవర్స్’ విజయాలతో సక్సెస్ ట్రాక్ లో ఉన్న సుమంత్ అశ్విన్ కు ‘చక్కిలిగింత’ హట్రిక్ విజయం అందిస్తుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు