విడుదలైన చందమామ కధలు మొబైల్ యాప్

విడుదలైన చందమామ కధలు మొబైల్ యాప్

Published on Apr 23, 2014 9:00 PM IST

chandamama-kathalu
ప్రవీణ్ సత్తారు తీసిన చందమామకధలు ఈ నెల 25న విడుదలకానుంది. దర్శకుడు ప్రస్తుతం ప్రచారం పై దృష్టిపెట్టాడు. ఇప్పటికే పాత్రల నిడివికోసం దర్శకుడు ఆల్జీబ్రా సిద్ధాంతాలు వాడినట్టు తెలిపాడు. సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలలో ఇది ఒకటి

ఇప్పుడు వీక్షకుల నుండి రివ్యూలకోసం ఈ సినిమా మొబైల్ యాప్ ని లాంచ్ చేసారు. ఈ సినిమాలో నటించిన చైతన్య కృష్ణ ఈ యాప్ ని లాంచ్ చేసారు. “దగ్గర స్నేహితుల నుంచి స్పందన ఆశించే కంటే ప్రతీ ఒక్కరి స్పందనా తీసుకోవడానికి ఈ ఐడియాని వాడుకుంటున్నాం” అని తెలిపాడు

ఈ సినిమాలో చైతన్య కృష్ణ, నరేష్, ఆమని, కృష్ణుడు, అభిజీత్, షామిలి, ఇషా, కిషోర్ మరియు రిచా పనై ప్రధాన భూమికలు పోషిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతదర్శకుడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు