రాజమౌళి సహాయం కోరిన చంద్రబాబు నాయుడు !

రాజమౌళి సహాయం కోరిన చంద్రబాబు నాయుడు !

Published on Dec 8, 2016 3:33 PM IST

SS-RAJAMOULI
తెలుగు సినిమా ప్రపంచం గర్వించదగ్గ సినిమా తీసిన ‘బాహుబలి’. ఈ సినిమాలో కథ, కథనం, నటీ నటుల నటన వంటి విషయాల్ని పక్కనబెడితే అన్నింటికన్నా పెద్ద విషయం మరొకటి ఉంటుంది. అదే విజువల్ ఎఫెక్ట్స్. ఆ విజువల్ ఎఫెక్ట్స్ తో సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యం. ఎక్కడో భారతీయ చరిత్రలో మునిగిపోయిన ఈ సామ్రాజ్యాన్ని రాజమౌళి తన సృజనాత్మకత, ఊహా శక్తితో మన కళ్ళ ముందు అద్భుతంగా ఆవిష్కరించాడు. సినిమాలో మాహిష్మతి రాజ్యాన్ని చూసిన ప్రేక్షులంతా ముక్కున వేలేసుకుని అద్భుతం అన్నారు. అంతలా ఆకట్టుకుంది జక్కన పనితనం. సినిమా చూసిన సమయ ప్రేక్షకులని కాకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా రాజమౌళి బాగా ఆకట్టుకున్నాడు.

ఎంతలా అంటే ఆంధ్రుల కలల నగరం అమరావతి నిర్మాణంలో చంద్రబాబే స్వయంగా రాజమౌళి సహాయం కోరేంతగా. అవును అమరావతి నిర్మాణం కోసం ఎందరో దేశ, విదేశీ నిర్మాణ నిపుణుల సలహాలు తీసుకున్న బాబు చివరికి భారతీయ చరిత్ర, సంస్కృతీ, శిల్ప కళల పై మంచి పట్టున్న రాజమౌళి సలహా, సహకారాలను తీసుకోవాలని నిర్ణయించుకుని రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ బృందం నిన్న రాజమౌళితో భేటీ అయి ముఖ్య నిర్మాణాలయిన కోర్టు, శాసన సభ, ఇతర భవనాల నిర్మాణంలో సహకారం అందించాలని కోరారు. రాజమౌళి కూడా సానుకూలంగా స్పందించి ‘బాహుబలి’ సినిమా పూర్తవగానే ప్రభుత్వ అధికారులకు సహాయపడతానని మాటిచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు