చందూ నా కెరీర్‌కు ఓ పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు : నాగ చైతన్య
Published on Oct 19, 2016 8:00 pm IST

premam
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ భారీ అంచనాల మధ్యన దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదలై మంచి హిట్ కొట్టేసిన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రెండో వారం కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకెళుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే టీమ్ నేడు హైద్రాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. అక్కినేని నాగార్జున ఈ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరై టీమ్‌కు అభినందనలు తెలిపారు.

ఇక ఈ సందర్భంగానే నాగ చైతన్య మాట్లాడుతూ.. “మళయాలంలో ఘన విజయం సాధించిన ప్రేమమ్ సినిమాను ఇక్కడ రీమేక్ చేస్తే, తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరించడం చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్స్ మామూలుగా సినిమా మొదలయ్యే ముందు హీరోకు పెద్ద హిట్ ఇస్తా అని మాటిస్తూ ఉంటారు. అలాంటివి ఏవీ చెప్పకుండానే, డైరెక్టర్ చందూ మొండేటీ నా కెరీర్‌కు ప్రేమమ్‌తో అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చాడు.” అన్నారు.
మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మంచి ప్రతిభ కనబర్చి నాగ చైతన్య నటుడిగా తన స్థాయిని పెంచుకున్న ఈ సినిమాలో శృతి హాసన్‌, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు.

 
Like us on Facebook