చరణ్, ఎన్టీఆర్.. ఇద్దరికీ న్యాయం చేస్తాడట రాజమౌళి !

దర్శక ధీరుడు రాజమౌళి పరిశ్రమలోని ఇద్దరు స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మల్టీ స్టారర్ చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. ఈ వార్తతో ఇరు హీరోల అభిమానుల్లోనూ నూతనోత్సాహాం నెలకొంది. ‘బాహుబలి-2’ సక్సెస్ తర్వాత జక్కనం చేస్తున్న సినిమా కావడంతో చిత్రంపై అన్ని పరిశ్రమలోనూ అమితాసక్తి నెలకొంది. అభిమానుల్లో రాజమౌళి పై గట్టి నమ్మకమే ఉన్నా ఇద్దరు హీరోలను సమానంగా, ఎలాంటి తేడాలు లేకుండా చూపెడతారా లేదా అనే చిరు సందేహం మొదలైంది.

కానీ అభిమానులు అలాంటి సందేహాలేవీ పెట్టుకోనక్కర్లేదని తెలుస్తోంది. తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి రాజమౌళి తయారుచేస్తున్న స్క్రిప్ట్ లో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయని, అంతేగాక ఇద్దరి మధ్య మంచి ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంటుందని, ఎక్కువ తక్కువలకు తావుండదని తెలుస్తోంది. సో ఈ భారీ మల్టీ స్టారర్ అటు చరణ్, ఇటు ఎన్టీఆర్ అభిమానులను సంతృప్తి పరిచేదిగానే ఉండబోతోందన్నమాట.

 

Like us on Facebook