పర్ఫెక్షన్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న చరణ్ అండ్ టీమ్ !

పర్ఫెక్షన్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న చరణ్ అండ్ టీమ్ !

Published on Sep 24, 2017 7:18 PM IST


రామ్ చరణ్ ఛాలెంజింగా తీసుకుని చేస్తున్న విభిన్న చిత్రం ‘రంగస్థలం 1985’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1985 బ్యాక్ డ్రాప్లో నడిచే పల్లెటూరి ప్రేమ కథగా ఉండనుంది. ప్రతి చిన్న అంశాన్ని చాలా డీటైల్డ్ గా స్క్రీన్ మీద చూపించే సుకుమార్ ఈ సినిమాను కూడా పూర్తి ఖచ్చితత్వంతో ప్రేక్షకుల ముందుంచాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే పాత్రల లుక్ నుండి లొకేషన్లు, సెట్టింగ్స్ అన్నీ 1985 నాటికి చెందినవిగా కనబడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాజాగా బయటికొచ్చిన లొకేషన్స్ ఫోటోలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. పాత్రలు ఉండబోయే ఇళ్ల దగ్గర నుండి కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోయే గ్రామ పంచాయితీ కార్యాలయం వంటి సెట్టింగ్స్ వరకు అన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా చూస్తున్నారు ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ చివరి నాటికీ ముగిసే అవకాశముంది. చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే సినిమా విడుదల ఎప్పుడో ఇంకా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు