సెంటిమెంట్ బ్రేక్ చేసిన రామ్ చరణ్..!

సెంటిమెంట్ బ్రేక్ చేసిన రామ్ చరణ్..!

Published on Oct 1, 2014 11:00 AM IST

Ram-charan
రామ్ చరణ్ తన మాటను నిలబెట్టుకున్నాడు. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విడుదలకు ముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే 8వ సినిమా ప్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ బ్రేక్ చేశాడు. తెలుగులో ప్రస్తుత అగ్ర హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లు కెరీర్ లో 7వ సినిమాతో భారి విజయాలు అందుకున్నారు. ఆ వెంటనే విడుదలైన 8వ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఈ సెంటిమెంట్, కృష్ణవంశి ట్రాక్ రికార్డు దృష్టిలో పెట్టుకుని ‘గోవిందుడు అందరివాడేలే’ విడుదల ముందు మెగా అభిమానుల ‘గోవిందుడు..’పై కొంత సందేహం వ్యక్తం చేశారు. అయితే దిగ్విజయంగా ఆ గండం గట్టేక్కేశాడు రామ్ చరణ్.

ఈ రోజు ఉదయం ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన ఈ సినిమా తొలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ కి మంచి పేరొచ్చింది. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. కుటుంబ కథా చిత్రాలు తీయడంలో తనది అందెవేసిన చెయ్యి అని మరోసారి కృష్ణవంశి నిరూపించుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు