రామ్ చరణ్ కల సగం నెరవేరింది !

రామ్ చరణ్ కల సగం నెరవేరింది !

Published on Dec 10, 2016 4:56 PM IST

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరిశ్రమలోని స్టార్ హీరోల్లో ఒకరు. ఇప్పటికీ ఆయన పేరు మీద కొన్ని చెరిగిపోని రికార్డులున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాస్ ప్రేక్షకుల్లో ఆయనకు భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. చరణ్ చేసే సినిమా జస్ట్ యావరేజ్ అనే టాక్ తెచ్చుకున్నా 40 కోట్లు కలెక్ట్ చేయడం గతంలో మామూలు విషయంగా ఉండేది. కానీ లోకల్ గా ఎన్ని రికార్డులున్నా ఓవర్సీస్ లో మాత్రం చరణ్ ట్రాక్ రికార్డ్ చెప్పుకోదగగ స్థాయిలో లేదు. ఇప్పటికీ ఆయన సినిమాకి యూఎస్ బాక్సాఫీస్ ముందు మిలియన్ డాలర్ రికార్డ్ లేదు.

చిన్న హీరోలు, చిన్న సినిమాలు పెద్ద కష్టపడకుండా మిలియన్ మార్కును అందుకుంటుంటే తనకు ఆ రికార్డ్ లేకపోవడంతో ఈసారి ‘ధృవ’తో ఎలాగైనా ఈ రికార్డుని అందుకోవాలని చెర్రీ స్వయంగా రంగంలోకి దిగి యూఎస్ లో ప్రీమియర్ షోలకు వెళ్లి సినిమాని ప్రమోట్ చేస్తూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన కష్టానికి తగ్గట్టే ప్రీమియర్లు, శుక్రవారం కలెక్షన్లు కలుపుకుంటే ధృవ ఇప్పటికే 463 వేల డాలర్లను వసూలు చేసి హాఫ్ మిలియన్ మార్కుకు దగ్గరపడిపోయింది. దీన్ని బట్టి చరణ్ కు ఇంకో రెండు రోజుల్లో మిలియన్ మార్కును అందుకోవడం ఖయామని మొత్తానికి చరణ్ కల నెరవేరనుందని అనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు