బ్రూస్ లీ డబ్బింగ్ ఫినిష్ చేసే పనిలో చరణ్

బ్రూస్ లీ డబ్బింగ్ ఫినిష్ చేసే పనిలో చరణ్

Published on Oct 4, 2015 9:51 AM IST

Brucele1
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’ దసరా కానుకగా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోన్న ఈ సినిమా చివరి దశ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. సినిమా రిలీజ్ కి ఇంకా 12 రోజులు మాత్రమే ఉండడంతో ఈ చిత్ర టీం మిగిలిన వర్క్స్ అన్నిటినీ చకచకా ఫినిష్ చేస్తోంది. ఒకవైపు రామ్ చరణ్ తన పార్ట్ కి సంబందించిన షూట్ ని శరవేగంగా ఫినిష్ చేస్తూనే మరో వైపు తన పార్ట్ కి డబ్బింగ్ కూడా చెబుతున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ ఫిస్ట్ హాఫ్ కి డబ్బింగ్ ని ఫినిష్ చేసాడు. ప్రస్తుతం సెకండాఫ్ కి డబ్బింగ్ చెప్పే పనిలో ఉన్నాడు. అనుకున్న టైంకి సినిమాని రిలీజ్ చెయ్యాలని చరణ్ అండ్ టీం ఎక్కువ టైం వర్క్ చేస్తున్నారు..

ఈ సినిమాలో చరణ్ తో పాటు మెగాస్టార్ చిరు కూడా ఓ 3 నిమిషాల పాటు కనువిందు చేయనున్నాడు. ఆ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. మరో 3 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘ది ఫైటర్’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నదియా, రావు రమేష్, కృతి కర్భంద ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఆడియో ఇటీవలే రిలీజ్ అయ్యి సూపర్ టాక్ తెచ్చుకుంటోంది. డివివి దానయ్య నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు