క్లైమాక్స్ ఫైట్ షూట్‌లో చెర్రీ సినిమా!

క్లైమాక్స్ ఫైట్ షూట్‌లో చెర్రీ సినిమా!

Published on Aug 1, 2015 7:05 PM IST

Ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శ్రీనువైట్ల ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, ఫస్ట్‌లుక్.. ఇలా ఒక్కటంటే ఒక్క లుక్ కూడా బయటకు రాలేదు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం ఆసక్తికరంగా మారడంతో పాటు వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఓ పక్క ఈ సినిమాపై రకరకాల వార్తలు షికారు చేస్తున్నా సినిమా యూనిట్ మాత్రం షూటింగ్ జరుపుకుంటూ పోతోంది.

ఇక ఈ మధ్యే బ్యాంకాక్‌లో మొదలైన ఈ సినిమా షూటింగ్ నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. అనల్ అరసు ఈ ఫైట్ సీక్వెన్స్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. అనల్ అరసుతో మొదటిసారి పనిచేస్తున్నానని, ఆయనతో పనిచేయడం చాలా బాగుందని రామ్ చరణ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సినిమాలో రామ్ చరణ్ స్టంట్ మాస్టా‌ర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే! గతంలో శ్రీనువైట్ల సినిమాలకు స్క్రిప్ట్ సమకూర్చిన కోన వెంకట్, గోపీ మోహన్‌లు మళ్ళీ ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు