చరణ్ మనసులో కొత్త ఆలోచనలేమైనా ఉన్నాయా?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం 1985’ ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన పల్లెటూరి సెట్లో జరుగుతోంది. నటీ నటుల లుక్ దగ్గర్నుండి సెట్ ప్రాపర్టీస్ వరకు అన్నింటిలోనూ వేలెత్తి చూపలేని పర్ఫెక్షన్ తో ఈ షూట్ సాగుతోంది. సుకుమార్ ఎంత ఆలస్యమైనా సినిమాను అనుకున్నట్టే తీయాలని ఎక్కడా తొందరపడకుండా పనిచేస్తున్నారు. చరణ్ కూడా సుకుమార్ కు కావాల్సినన్ని డేట్స్ ఇచ్చేసి బాగా సహకరిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అభిమానులు మాత్రం కొంత నిరుత్సాహానికి గురవుతూనే ఉన్నారు.

అందుకు కారణం ఫస్ట్ లుక్ ఆలస్యమే. ఎన్నో నెలల క్రితం షూట్ మొదలుపెట్టి ప్రీ లుక్ ను రిలీజ్ చేసినా ఇప్పటికీ మరొక అప్డేట్ అనేదే లేకపోవడం, కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకపోవడం ఏమిటని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చరణ్ ఇప్పటి వరకు చేసిన ఏ సినిమాలో కూడా ఇంతలా ఆలస్యం జరగలేదు. బహుశా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చరణ్ ఫస్ట్ లుక్ విషయంలో ఏవైనా కొత్తగా ఆలోచిస్తూ, భిన్నంగా ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

మరి ఆ ప్లాన్స్ ఏమిటో తెలియాలంటే చరణ్ లేదా సుకుమార్ లలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి, అనసూయలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

Like us on Facebook