మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న చరణ్ సినిమా !

మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న చరణ్ సినిమా !

Published on Apr 24, 2017 5:42 PM IST


రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక రొమాంటిక లవ్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితం గోదావరి జిల్లాలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ యొక్క మొదటి షెడ్యూల్ ఎట్టకేలకు ఈరోజే పూర్తయింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ తన పేస్ బుక్ ద్వారా స్వయంగా తెలిపారు. ఈ లాంగ్ షెడ్యూల్లో చరణ్, సమంతల మీద గ్రామీణ నైపథ్యంలో సాగే కీలక సన్నివేశాలని చిత్రీకరించారు.

ఇక రెండవ షెడ్యూల్ ను మే రెండవ వారంలో మొదలుపెట్టే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో చరణ్ తన స్టార్ ఇమేజ్ ను పూర్తిగా పక్కనబెట్టి చాలా భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. ఆ పాత్ర పేరు చిట్టిబాబని, అది ఒక జాలరి యువకుడి పాత్రని తెలుస్తోంది. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి నెగెటివ్ రోల్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు