పూర్తైన రామ్ చరణ్ సినిమా బ్యాంకాక్ షెడ్యూల్ !

పూర్తైన రామ్ చరణ్ సినిమా బ్యాంకాక్ షెడ్యూల్ !

Published on May 22, 2018 12:49 PM IST

రామ్ చరణ్, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం బ్యాంకాక్ లో షెడ్యూల్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ కొద్దిసేపటి క్రితమే పూర్తైంది. ఈ షెడ్యూల్లో హీరో హీరోయిన్లు రామ్ చరణ్, కైరా అద్వానీల మీద కొన్ని రొమాంటిక్, కామెడీ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక తర్వాతి షెడ్యూల్ ఎప్పుడు, ఎక్కడ మొదలవుతుంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తొలిసారి చరణ్, బోయపాటి కలిసి చేస్తున్న సినిమా కావడం, ఇటీవలే ‘రంగస్థలం’తో చరణ్ బ్లాక్ బస్టర్ అందుకుని ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. నిర్మాత డివివి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రసుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా కైరా అద్వానీ నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు