‘క్వీన్’ రీమేక్ లో ఛార్మి..?

‘క్వీన్’ రీమేక్ లో ఛార్మి..?

Published on Jul 22, 2014 11:01 AM IST

charmi

హిందీలో సూపర్ సక్సెస్ సాదించిన ‘క్వీన్’ సినిమాను దక్షినాది భాషలలో రీమేక్ హక్కులను ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. హిందీలో కంగనా రనౌత్ నటన విమర్శకుల ప్రసంశలతో పాటు ప్రేక్షకుల జేజేలు అందుకుంది. ఆమెను మరిపించేలా సౌత్ రీమేక్ లో నటించే నటి ఎవరు..? అనే చర్చ జరుగుతుంది.

త్రిష. సమంత, ఆశిన్ ఇలా కొందరి హీరోయిన్ల పేరు మీడియాలో వినిపించినా చివరకు ఆ అవకాశం ఛార్మిని వరించిందని సమాచారం. ప్రస్తుతం ఛార్మితో దర్శకనిర్మాత చర్చలు జరుపుతున్నారు. ‘క్వీన్’ రీమేక్ లో ఛార్మి నటించడం దాదాపు ఖాయమనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ‘క్వీన్’ సినిమాను రీమేక్ చేస్తున్నారు. నాలుగు భాషలలో హీరోయిన్ ఒకరే. వేర్వేరు హీరోలు నటిస్తారు.

లేడీ ఓరియెంటెడ్ సినిమా హీరోయిన్ గా ఛార్మికి మంచి రికార్డు ఉంది. ఆమె నటించిన అనగనగా ఒక రోజు, మంత్ర వంటి ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ సక్సెస్ సాదించాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు