అభిమానులను మరోసారి నిరుత్సాహపరిచిన చైతూ!

అభిమానులను మరోసారి నిరుత్సాహపరిచిన చైతూ!

Published on Oct 27, 2016 4:10 PM IST

naga-chaitanya-interview
అక్కినేని నాగ చైతన్య ‘ప్రేమమ్’ సినిమాతో అభిమానులకు మంచి దసరా గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 7న విడుదలైన ఈ సినిమా చైతూకి సోలో హీరోగా స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఇక ఇదే ఉత్సాహంతో ఆయన హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ అన్న సినిమా కోసం కూడా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ప్రేమమ్’ కంటే ముందే విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ ఇప్పటికి అంతా సెట్ చేసుకొని నవంబర్‌లో విడుదలకు సిద్ధమైంది.

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమా తమిళ వర్షన్‌లో శింబు హీరోగా నటించారు. ఇక తమిళ వర్షన్‌కు సంబంధించిన ఓ కొత్త ట్రైలర్‌ను గత వారమే విడుదల చేయగా, తెలుగు వర్షన్ ట్రైలర్‌ను నేడు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రోజైనా ట్రైలర్ వస్తుందని ఆశించిన అభిమానులను నిరాశపరుస్తూ టీమ్, ట్రైలర్‌ను మళ్ళీ వాయిదా వేసింది. సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్‌ను విడుదల చేయలేకపోతున్నామని, త్వరలోనే ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని టీమ్ తెలిపింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే టీజర్, ఆడియోతో మంచి అంచనాలను రేకెత్తించింది. ‘ఏమాయ చేశావే’ తర్వాత గౌతమ్ మీనన్ – చైతూ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడం ‘సాహసం శ్వాసగా సాగిపో’కు మొదట్నుంచీ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చిపెట్టింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు