పెళ్ళయ్యాక కూడా సమంత సినిమాలు చేస్తుంది : నాగ చైతన్య
Published on Oct 3, 2016 5:40 pm IST

naga-chatanya-samantha
అక్కినేని హ్యాండ్సమ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం తన కొత్త సినిమా ‘ప్రేమమ్‌’ను విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను టీమ్ వేగవంతం చేసేసింది. ఇక ఇదే ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాగ చైతన్యతో ముచ్చటిస్తూ ఓ టీవీ ఛానల్ హీరోయిన్ సమంతతో ఆయన ప్రేమ విషయాన్ని ప్రస్తావించింది. దీనికి స్పందిస్తూ సమంత, తాను చాలాకాలంగా ఫ్రెండ్స్ అని, ఇష్టాలు, ఆలోచనలు కలిసి ప్రేమలో పడ్డామని తెలిపారు.

అదేవిధంగా వచ్చే ఏడాది తమ పెళ్ళి ఉంటుందని, ఇంకా డేట్ ఏదీ ఫిక్స్ చేసుకోలేదని అన్నారు. ఇక పెళ్ళి తర్వాత సమంత సినిమాలు మానేస్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, “నేనైనా రెండు కుటుంబాల సపోర్ట్‌తో హీరోగా ఈ స్థాయికొచ్చా. సమంత తన సొంత కష్టంతో ఈ స్థాయికి వచ్చింది. అలాంటి వ్యక్తిని పెళ్ళి కాగానే సినిమాలు ఆపేయమని ఎవ్వరూ అనరనే అనుకుంటా. స్వతహాగా నాకైతే పెళ్ళి తర్వాత తను సినిమాలు మానేయాలన్న ఆలోచన అస్సలు లేదు.” అని స్పష్టం చేశారు.

 
Like us on Facebook