చిరు ముఖ్య అతిధిగా గోవిందుడు ఆడియో

చిరు ముఖ్య అతిధిగా గోవిందుడు ఆడియో

Published on Aug 28, 2014 8:43 AM IST

ramcharan-and-chiru
బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ హీరోగా చేస్తున్న సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. యువన్ శంకర్ రాజ మ్యూజిక్ అందించిన ఆడియోని సెప్టెంబర్ 15న రిలీజ్ చేయనున్న సంగతి ఇది వరకే తెలిపాం. తాజా సమాచారం ప్రకారం ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఆలాగే ఈ మూవీని అక్టోబర్ 1న రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. అక్కడ చరణ్ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ మరియు కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. తాజా సమాచారం లండన్ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చాక నానక్రాంగూడాలో వేసిన ఓ సెట్లో మరో పాటని షూట్ చేయనున్నారు. ఈ రోజు చెన్నైలో ఈ సినిమాకి సంబదించిన రీ రికార్డింగ్ పనులను కూడా మొదలు పెట్టారు. రామ్ చరణ్ కూడా లండన్ నుంచి రాగానే తన పార్ట్ కి డబ్బింగ్ మొదలు పెట్టనున్నాడు. ప్రస్తుతం మిగతా నటీనటులకు సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ తన కెరీర్లో మొదటిసారిగా చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి కృష్ణవంశీ డైరెక్టర్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు