ఆ సెంటిమెంట్ ప్రకారం సినిమా సక్సెస్ ఖాయమన్న చిరంజీవి !

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ సంక్రాంతికి రిలీజ్ కానుండగా ఈరోజు సాయంత్రం భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ సందర్బంగా మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్న మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 సక్సెస్ ఖాయమనడానికి ఒక బలమైన సెంటిమెంట్ ఉందని అన్నారు. అదేమిటంటే గతంలో తను చేసిన ‘ఠాగూర్’ చిత్రం మురుగదాస్ చేసిన తమిళ ‘రమణ’ మూవీకి రీమేక్ గా వచ్చిందే. అప్పట్లో మురుగదాస్ అందుబాటులో లేకపోవడం వలన వినాయక్ చేయగలడని అనిపించి అతనితో చేశాం. అది పెద్ద హిట్టయింది.

ఇప్పుడు కూడా మురుగదాస్ ‘కత్తి’ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నప్పుడు వినాయక్ మొదట గుర్తొచ్చాడు. అతడైతేనే ఈ ప్రాజెక్టుని సరిగ్గా డీల్ చేయగలదనిపించింది. కాబట్టి సెంటిమెంట్ ప్రకారం చూస్తే ‘ఠాగూర్’ ఎలా హిట్టయిందో ఇది కూడా అలాగే హిట్టవ్వడం ఖాయం అన్నారు. అలాగే వినాయక్ ఈ సినిమాని తన సొంత సినిమా అనుకుని చేసి నాకు మరింత దగ్గరయ్యాడంటూ వినాయక్ తో తన అనుబంధాన్ని పంచుకున్నారు.

 

Like us on Facebook