ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించిన రామ్ చరణ్ ..!

ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించిన రామ్ చరణ్ ..!

Published on Apr 29, 2016 3:56 AM IST

konidala
మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు అయన తన నిర్మాణ సంస్థ పేరును, లోగోను విడుదల చేశారు. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ పేరు తో తన నిర్మాణ సంస్థను ప్రారంభించిన రామ్ చరణ్ ఆందులో ఆరెంజ్ రంగులో చాలా స్టైలిష్ గా ఉన్న హనుమాన్ చిత్రాన్ని రూపొందించడం విశేషం. ఇకపై ఈ లోగో నే సినిమా కు సంబంధించిన అన్ని ప్రచార మాధ్యమాల్లో ఉపయోగిస్తారు.

ఈ సినిమా ఈ రోజు మధ్యాహ్నం 1.30 కి ముహుర్తం కార్యక్రమాలు జరుపుకోబోతున్నది. స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ కెమరామేన్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మిగతా విషయాలు త్వరలో తెలుస్తాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు