కామెడీ విత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చిరు 150వ సినిమా

కామెడీ విత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చిరు 150వ సినిమా

Published on Aug 21, 2014 8:37 AM IST

chiranjeevi
ఒకప్పుడు తన సినిమాలతో తెగ ఎంటర్టైన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చివరి సినిమా ‘శంకర్ దాదా జిందాబాద్’. 2007లో వచ్చిన ఈ సినిమా తర్వాత చిరంజీవి రాజకీయాలతో బిజీ అయిపోయారు. ఆయన అలా రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం వలన ఆయన చేయాల్సిన 150వ సినిమా పెండింగ్ ఉండిపోయింది. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన రోజు నుంచి మెగా అభిమానులు కాస్త ఖాళీ టైం చూసుకొని మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా తీస్తారని వేచి చూస్తున్నారు.

ఎట్టకేలకు చిరంజీవి 150వ సినిమా చేయడానికి సిద్దమయ్యారు. ఈ 150వ సినిమా గురించి చిరంజీవి తన పుట్టినరోజు అయిన ఆగష్టు 22న అనౌన్స్ చేయనున్నారని ఇది వరకే తెలిపాము. తాజా సమాచారం చిరంజీవి చేయబోయే 150వ సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్. ఆయన పొలిటికల్ లేదా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదని, మళ్ళీ తన అభిమానులను ఎంటర్ టైన్ మాత్రమే చేయాలనుకుంటున్నాడని సమాచారం. ప్రస్తుతం తమ దగ్గర ఉన్న కథల్లో ది బెస్ట్ కథని ఫైనలైజ్ చేసే పనిలో రామ్ చరణ్ ఉన్నాడు.

ఒకసారి కథ ఫైనలైజ్ అయ్యాక దర్శకుడిని ఎంచుకునే ఆలోచనలో ఉన్నారు. అలాగే ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మించనున్నాడు. అలాగే చిరు 150వ సినిమాలో ఒక్క సీన్ లో అన్నా కనిపించాలని రామ్ చరణ్ అంటున్నాడు. చిరు 150వ సినిమా గురించి మరిన్ని వివరాలు ఆగష్టు 22న తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు