బాపూగారిని ప్రశంసించిన చిరు

బాపూగారిని ప్రశంసించిన చిరు

Published on Dec 20, 2014 1:05 PM IST

Chiranjeevi-at-Bapus-Film-F
ప్రసాద్ ల్యాబ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బాపు ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా నిన్న మెగాస్టార్ చిరంజీవి వీరి కాంబినేషన్ లో వచ్చిన కామిక్ హిట్ ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాను తిలకించారు. బాపు గారితో ఆయనకున్న అనుభందాన్ని గుర్తుచేసుకుంటూ ‘మన వూరి పాండవులు’ సినిమాలో పార్ధు పాత్రకు బాపూ గారే ఆడిషన్ చేశారని ఆయనని మెప్పించడానికి బాగానే కష్టపడాల్సివచ్చినట్టు తెలిపారు

బాపూని ప్రముఖ చిత్రకారాడు పికాసోతో పోల్చారు. తెలుగు జాతి పొందిన ఆణిముత్యం బాపూగారని, ఆయన కుంచెలో మన దేవుళ్ళు కొలువుదీరివున్నారని తెలిపారు. తనది, తన భార్యది కలిపి ఒక పెయింటింగ్ బాపూ గారితో వేయించుకోవాలని వుండేదని చిరు తన మనసులో మాట బయటపెట్టాడు

స్క్రీనింగ్ కి ముందు బాపూ గారు గీసిన చిత్రాలను ఆర్ట్ గ్యాలరీ రూపంలో నిర్మించారు. బాపు జన్మదినం సందర్భంగా హైదరాబాద్ ఫిలిం క్లబ్ ఈ ఫిలిం ఫెస్టివల్ ని నిర్వహిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు