50 రోజులు పూర్తి చేసుకున్న ‘ఖైదీ నెం 150’ !

50 రోజులు పూర్తి చేసుకున్న ‘ఖైదీ నెం 150’ !

Published on Mar 1, 2017 11:31 AM IST


అభిమానుల 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘ఖైదీ నెం 150’. ఈ చిత్రం సాధించిన ఘన విజయం మెగాస్టార్ ను మళ్ళీ నెం 1 స్థానంలో కూర్చోబెట్టింది. ఈ అపూర్వ విజయంతో అభిమానులు సైతం ఆనందంలో మునిగిపోయారు. జనవరి 11న రిలీజైన ఈ సినిమా ఈరోజుటితో 53 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 105 కోట్ల షేర్ వసూలు చేసింది.

చిత్ర నిర్మాతల లెక్కల ప్రకారం బాహుబలి తర్వాత 100 కోట్ల షేర్ మార్క్ దాటిన చిత్రం ఇదే కావడం విశేషం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు ఈ అర్థ శత దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే చిరు తన 151వ సినిమాగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనే చిత్రాన్ని చేయనుండగా దీనికి కూడా చరణే నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు