‘ఖైదీ నెం. 150’లో చిరు డ్యాన్సులతో అదరగొడతారట!

‘ఖైదీ నెం. 150’లో చిరు డ్యాన్సులతో అదరగొడతారట!

Published on Oct 13, 2016 6:13 PM IST

khaidi150
మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ‘ఖైదీ నెం. 150’ కొద్ది నెలలుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండడంతో, అనుకున్న తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలని టీమ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‍లో వేసిన స్పెషల్ సెట్‌లో ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి, లక్ష్మిరాయ్‌లపై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ పాటకు రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. చిరంజీవితో కలిసి గతంలో పలు సూపర్ హిట్ పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేసిన లారెన్స్, ఖైదీ నెం. 150కి కూడా అదిరిపోయే స్టెప్స్ డిజైన్ చేశారట. ఈ స్టెప్స్‌తో చిరంజీవి అదరగొట్టడం ఖాయమని టీమ్ చెబుతోంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘ఖైదీ నెం. 150’ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు