సిక్స్ ప్యాక్ చేయాలంటున్న మెగాస్టార్ చిరంజీవి..

సిక్స్ ప్యాక్ చేయాలంటున్న మెగాస్టార్ చిరంజీవి..

Published on Sep 1, 2014 11:44 AM IST

Chiranjeevi-(11)
రామ్ చరణ్ తో కలసి ‘రచ్చ’ సినిమాలో నటించిన హీరోయిన్’తో కలసి నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. తమన్నాతో నటించాలంటే ఇంకా స్లిమ్ అయ్యి సిక్స్ ప్యాక్ చేయాలేమో.? అని సరదాగా వ్యాఖ్యానించారు చిరు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్వహిస్తున్న ‘సౌందర్య లహరి’ కార్యక్రమంలో పాల్గొన్న చిరు ఈ వ్యాఖ్యలు చేశారు.

వానా వానా వెల్లువాయే పాట రీమిక్స్ లో తమన్నా హుషారైన స్టెప్పులు చూసి ముగ్డులైన చిరంజీవి ఒకవేళ నేను మళ్లీ నటిస్తే తమన్నాతో కలసి నటించాలని ఉందంటూ ‘రచ్చ’ ఆడియోలో ప్రసంశలు జల్లు కురిపించారు. మీరు ఓకే అంటే మీ పక్కన నటించడానికి నేను రెడీ అంటూ తమన్నా రిప్లై ఇచ్చింది.

ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. కామెడీ ఎంటర్టైనర్ గా చిరు 150వ సినిమా ఉంటుందని రామ్ చరణ్ ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు