చిరంజీవి కష్టమంతా ఆ ఒక్క ఫోటోలోనే కనిపించేస్తోంది !
Published on Nov 15, 2016 11:16 pm IST

khaidi-150
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైధీ నెం 150 ని అనౌన్స్ చేయగానే చాలా మంది గిట్టని వాళ్ళు ఆయనకు వయసు ఎక్కువైందని, ఇక హీరోగా చేయడం అంటే సాహసమేనని అన్నారు. పైగా చిరు తన 150వ సినిమాగా తమిళ ‘కత్తి’ చిత్రాన్ని రీమేక్ చేయాలని డిసైడ్ చేసుకోగా అది అసాధ్యమని, చిరుకు ఆ కథ సెట్ అవ్వదని అన్నారు. దీంతో అభిమానులు కూడా ఇన్నేళ్ల తరువాత మేకప్ వేసుకుంటున్న తమ హీరో ఎలా ఉంటాడో అని కాస్త కంగారును లోనయ్యారు. కానీ చిరంజీవి మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

సినిమాకి ముందుగానే బాడీ ఫిట్ నెస్ కోసం వర్కవుట్లు చేశారు. షూటింగ్ కి అంతరాయం కలగకూడదని ఎన్నాళ్లగానో భాధిస్తున్న భుజం గాయానికి ఆపరేషన్ చేయించుకొని పూర్తిగా కోలుకున్నాక సినిమా మొదలుపెట్టారు. ఆ తరువాత కొన్నాళ్ళకు పూర్తి స్థాయిలో చిరు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. అందులో చిరు యంగ్ హీరోలకి ఏమాత్రం తీసి పోకుండా కనబడ్డారు. దాంతో అభిమానుల అనఁదానికి అవధుల్లేకుండా పోయాయి.మల్లె ఇప్పుడు తాజాగా యూరప్ లో జరుగుతున్న సన్గ్ షూట్ లొకేషన్ నుండి ఒక ఫిక్ విడుదలైంది. అందులో అయితే చిరు ఇంకా యంగ్ గా కనిపిస్తున్నారు. ఆ ఫోటో చూసిన వారంతా సినిమా కోసం చిరు చేస్తున్న కష్టానికి ఇదే నిదర్శనమని అంటున్నారు. ఇకపోతే వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు.

 
Like us on Facebook