చిట్ చాట్ : అల్లు అర్జున్ – టాలీవుడ్ దర్శకుల నుంచి ప్రత్యేక గౌరవాన్ని తెచ్చి పెట్టిన సినిమా ‘రుద్రమదేవి’.

చిట్ చాట్ : అల్లు అర్జున్ – టాలీవుడ్ దర్శకుల నుంచి ప్రత్యేక గౌరవాన్ని తెచ్చి పెట్టిన సినిమా ‘రుద్రమదేవి’.

Published on Oct 4, 2015 7:48 PM IST

Allu-arjun
టాలీవుడ్ లో ఏ హీరో లేదా డైరెక్టర్ నుంచి అయినా ఓ మంచి సినిమా వచ్చింది అంటే వారిని ఎంకరేజ్ చేయడంలో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటాడు. అంతే కాకుండా తనవల్ల ఓ మంచి సినిమాకి సాయం జరుగుతుంది అంటే ఏం చెయ్యడానికైనా సిద్దం. అలా అల్లు అర్జున్ గోనగాన్నా రెడ్డిగా చేసిన సినిమానే ‘రుద్రమదేవి’. ఈ సినిమా అక్టోబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దాంతో మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం ఇచ్చాడు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) మీరు రుద్రమదేవి సినిమా చెయ్యడానికి గల ప్రధాన కారణం ఏమిటి.?
స) నేను ఈ సినిమా చెయ్యడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయిలో ఓ సినిమా మనం కూడా తీయగలం.. అలాంటి సినిమా మన ఇండస్ట్రీ నుంచి వస్తుందంటే ఒక తెలుగు హీరోగా నేను గర్వంగా ఫీలవుతాను. అదే సినిమాలో నేను నటిస్తే హెల్ప్ అవుతుందంటే నేనెప్పుడు రెడీ. ఇక రెండవది.. సీనియర్ ఎన్.టి.అర్, ఎ.ఎన్.ఆర్, ఎస్.వి.ఆర్ టైంలో వారికీ సోలో హీరోగా ఎంతటి స్టార్డం ఉన్నా ఓ మంచి సినిమాలో ఓ ముఖ్య పాత్ర చెయ్యాలి అంటే అందరితో కలిసి చేసేసేవారు. కానీ ఆ సంస్కృతి ఇప్పుడు కరువైంది. ఇలాంటి ఓ సినిమాతో ఆ సంస్కృతిని నేను ప్రారంభిస్తే మళ్ళీ మన స్టార్ హీరోలంతా ఇలాంటి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతారని చేసాను.

ప్రశ్న) రుద్రమదేవి సినిమాని 2డి అండ్ 3డి ఫార్మాట్ లో తీసారు. మీకు ఏ ఫార్మాట్ లో చేయడం కష్టం అనిపించింది.?
స) నాకు తెలిసి 3డి ఫార్మాట్ చెయ్యడమే చాలా కష్టం. అంత సులువైన విషయం కాదు. మామూలుగా 3డి ఫార్మాట్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి.. మనం సినిమా తీసేసి దాన్ని 3డిలోకి కన్వర్ట్ చేసుకోవడం, రెండవది మొదటి నుంచి స్టీరియో స్కోపిక్ టెక్నాలజీతో సినిమా మొత్తాన్ని షూట్ చేయడం. అందుకే డైరెక్ట్ 3డిలో చేయడం చాలా కష్టం. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తా.. మాములుగా అయితే ఒక సీన్ లో ఒక షాట్ చేసాక మరో షాట్ కోసం కెమెరా యాంగిల్ మరియు లెన్స్ మార్చుకోవడానికి 3 నిమిషాలు పడుతుంది, కానీ 3డిలో ఒక లెన్స్ మార్చి కెమెరా యాంగిల్ సెట్ చేసుకోవడానికి 45 నిమిషాలు పడుతుంది. అంతసేపు నటుడు అదే మూడ్ లో ఉండాలి, అది చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే 3డిలో చెయ్యడం కష్టం.

ప్రశ్న) అసలు మీరెంతవరకూ ఈ సినిమాకి సపోర్ట్ ని ఇచ్చారు.?
స) నేను ఈ సినిమాకి ఎలా సపోర్ట్ ఇచ్చాను అనేదానికి ఒక సంఘటన చెబుతా.. అప్పుడే నేను ‘S/O సత్యమూర్తి’ చెయ్యాలి. సెట్స్ పైకి వెళ్ళే టైంలో ఇది విని ఓకే చెప్పా.. అప్పుడు నేను వెళ్లి త్రివిక్రమ్ గారిని ఇలా గుణ గారి ప్రాజెక్ట్ ఒకటి ఉంది, దానికి నా వంతు హెల్ప్ చేస్తానని చెప్పను అనగానే.. నో ప్రోబ్లం బన్ని, అమన సినిమా ఒకనెల రోజులు ఆలస్యం అవుతుంది అంతేగా.. ఇబ్బంది లేదు. కానీ నీలాంటి స్టార్ హీరో సపోర్ట్ గుణకి చాలా అవసరం. వెళ్లి చేసిరా అన్నారు. సో నేను ఈ సినిమా చేయడంలో త్రివిక్రమ్ కి కూడా పార్ట్ ఉంది. అలా నా తరపున సపోర్ట్ ఇచ్చాను.

ప్రశ్న) రుద్రమదేవి సినిమాలో గోనగన్నా రెడ్డిగా మీరు చేస్తున్నారు అనగానే మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి.?

స) రుద్రమదేవి సినిమా ద్వారా నాకు కాంప్లిమెంట్స్ కాదు, అంతకు మించిన గౌరవం దక్కింది. నేను ఈ సినిమాలో ఓ రోల్ చేస్తున్నాను అని న్యూస్ వచ్చినప్పటి నుంచీ చాలా మంది దర్శకులు నాకు కాల్ చేసి అభినందించారు. అలాగే ప్పుడు దర్శకులు కలిసినా ఆ విషయంలో నాకు సెల్యూట్ చేసి అభినందనలు తెలిపేవారు. ఇన్ని రోజులు బన్ని అంటే అందరికీ ఇష్టం ఉండేది. కానీ ఇప్పుడు ., టాలీవుడ్ దర్శకులందరిలోనూ నాకు ప్రత్యేక గౌరవాన్ని తెచ్చి పెట్టిన సినిమా ‘రుద్రమదేవి’.

ప్రశ్న) గుణశేఖర్ రుద్రమదేవికి 80 కోట్లు పెట్టారు.. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టడం రిస్క్ అని మీకు అనిపించలేదా.?
స) ఇందులో రిస్క్ ఏమీ లేదండీ.. ఇక్కడ ఓ పాయింట్ చెప్పాలి.. ఓ స్టార్ హీరో కంటే ఓ సినిమాకి కావాల్సింది కంటెంట్, అది ఉంటె హీరో ఉన్న సినిమానా, హీరోయిన్ ఉన్న సినిమానా అనేది చూడరు. స్ట్రాంగ్ కంటెంట్ తో వచ్చిన అరుంధతి సినిమా లేడీ ఓరియెంతెడ్ ఫిల్మ్ కానీ అది సాధించిన రికార్డ్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా.. అలానే స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమానే ‘రుద్రమదేవి’.

ప్రశ్న) స్టార్ హీరోలతో ఈక్వల్ గా కష్టపడి చేసిన అనుష్క వర్క్ మీద మీ అభిప్రాయం.?
స) అనుష్క చాలా చాలా టాలెంటెడ్ మరియు డెడికేషన్ ఉన్న వ్యక్తి. ఒక స్టార్ హీరో కూడా కష్టపడనంతగా మూడేళ్ళ పాటు ఎంతో శ్రమించి పూర్తి డెడికేషన్ తో ఈ సినిమా చేసింది. తన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ని నా హ్యాట్సాఫ్. అనుష్క తప్ప ఇంకెవరూ ఇలాంటి సాహసం చేయలేరు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు