చిట్‌చాట్ : అవికా గోర్ – ‘తను నేను’ రోల్ నా కెరీర్‌కి స్పెషల్!

చిట్‌చాట్ : అవికా గోర్ – ‘తను నేను’ రోల్ నా కెరీర్‌కి స్పెషల్!

Published on Nov 25, 2015 4:15 PM IST

avika
తెలుగునాట తన సొంత పేరుతో కన్నా ‘చిన్నారి పెళ్ళికూతురు’ ఆనందిగానే ఎక్కువగా పరిచయమున్న నటి అవికా గోర్. బుల్లి తెరపై సంచలనం సృష్టించిన ఈ యువ హీరోయిన్, ఆ తర్వాత వెండితెరపైనా తానేంటో నిరూపించుకుంది. తెలుగులో ‘ఉయ్యాల జంపాల’, ‘లక్ష్మి రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావా’ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న అవికా, తాజాగా ‘తను నేను’ అంటూ మరో ప్రేమకథతో మనముందుకు వస్తున్నారు. ఈ శుక్రవారం ఈ సినిమా విడుదలవుతోన్న సందర్భంగా హీరోయిన్ అవికాతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) వరుస హిట్స్ తర్వాత వస్తోన్న మీ సినిమా ‘తను నేను’ గురించి చెప్పండి?

స) ‘తను నేను’ సినిమాను మన ఫర్మాట్ ప్రకారం నడిచే టిపికల్ లవ్‌స్టోరీలా కాకుండా ఓ మెచ్యూర్డ్ లవ్‌స్టోరీగా చెప్పుకోవచ్చు. హీరో, హీరోయిన్లు ఇద్దరికీ ప్రేమపై సరైన అవగాహన ఉంటుంది. అందుకు తగ్గట్లే వాళ్ళ లవ్‌స్టోరీ కూడా చాలా సెన్సిబుల్‌గా ఉంటుంది. నా గత సినిమాల్లానే ఈ సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చుతుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతోంది?

స) ‘తను నేను’లో నేను కీర్తి అనే ఓ సెన్సిబుల్, సెన్సిటివ్ అమ్మాయిగా కనిపిస్తా. నేను ఇదివరకు చేసిన పాత్రలతో పోలిస్తే ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అందువల్లే ఈ సినిమాలో నా పాత్రను కెరీర్‌కు స్పెషల్‌గా చెప్పుకుంటా. కెరీర్ విషయంలో, లవ్ విషయంలో తనంతట తానుగా సొంత నిర్ణయాలు తీసుకునే అమ్మాయే కీర్తి. నా నిజ జీవితానికి కూడా పూర్తి విరుద్ధమైన పాత్ర.

ప్రశ్న) మీ డెబ్యూట్ సినిమా ‘ఉయ్యాల జంపాల’ నిర్మాత రామ్మోహన్ దర్శకుడుగా మారి చేసిన సినిమా ‘తను నేను’. నిర్మాతగా, దర్శకుడిగా ఆయనలో మార్పులు ఏం చేశారు?

స) ‘ఉయ్యాల జంపాల’ సినిమా అప్పుడు రామ్మోహన్ గారు కొంత గంభీరంగా పెద్దగా మాట్లాడకుండా ఉండేవారు. ఈ సినిమాకి ఆయనే దర్శకత్వం చేయడంతో అందరితో కలిసి సరదాగా సన్నివేశం గురించి చెబుతూ చాలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. దర్శకుడిగా సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ తన సెన్సిబిల్ ఆలోచనలను చెప్పడంలో ఆయన టాలెంట్ చూడొచ్చు. నన్నడిగితే ఆయన దర్శకుడిగా మరెన్నో మంచి సినిమాలు తీయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి.

ప్రశ్న) టాలీవుడ్ ఎలా ఉంది? ప్రస్తుతం ఏయే సినిమాలు చేస్తున్నారు? భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?

స) టాలీవుడ్ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన కొత్తల్లో నాకు టాలీవుడ్ గురించి ఏమీ తెలీదు. ఇప్పుడు ఇక్కడ నన్ను కూడా అందరూ గుర్తుపడుతున్నారు. తెలుగు ప్రేక్షకుల నుంచి ఇంతమంచి రెస్పాన్స్ అయితే ఊహించలేదు. ఇక ప్రస్తుతం ‘కేరాఫ్ ఫుట్‌పాత్ 2’ (తెలుగులో మాంజా) అనే సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అదే విధంగా కొన్ని మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అన్నీ ఆలోచించుకొని ఓకే చేస్తున్నా. నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే పాత్రలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు