చిట్ చాట్ : ‘డార్లింగ్’ స్వామి – ఎంత పెద్ద హిట్ సినిమా అయినా లాజిక్స్ మిస్ అవుతాయి.

చిట్ చాట్ : ‘డార్లింగ్’ స్వామి – ఎంత పెద్ద హిట్ సినిమా అయినా లాజిక్స్ మిస్ అవుతాయి.

Published on Jul 20, 2014 6:37 PM IST

darling-swamy

‘ఒక ఊరిలో’ సినిమా ద్వారా డైలాగ్ రైటర్ గా పరిచయం అయిన స్వామి ‘హ్యాపీ’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలకి పనిచేసి ‘డార్లింగ్’ సినిమాతో బాగా ఫేమస్ అవ్వడమే కాకుండా డార్లింగ్ ని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. డైరెక్టర్ గా మారి ‘రొమాన్స్’ సినిమా చేసిన డార్లింగ్ స్వామి తాజాగా ‘దృశ్యం’ సినిమాకి మాటలని అందించాడు. ఈ సినిమా పెద్ద విషయం సాధించడంతో తన ఆనందాన్ని పంచుకోవడం కోసం మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘దృశ్యం’ సినిమా విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు.?

స) చాలా ఆనందంగా ఉంది. ‘దృశ్యం’ సినిమా సక్సెస్ ఈ టీంలోని ప్రతి ఒక్కరికీ చెందుతుంది. మలయాళ సినిమా చూసిన రోజు నుంచి ప్రతి ఒక్కరూ తెలుగులో కూడా ఓ మంచి సినిమాని ఇచ్చి సూపర్ హిట్ అందుకోవాలని అనుకున్నాం. మొదటి నుంచి హిట్ అవుతుంది అనుకున్నాం, అనుకున్నట్టుగానే పెద్ద హిట్ అయ్యింది.

ప్రశ్న) ఈ సినిమాకి స్క్రీన్ ప్లే బాగున్నా కానీ, కొన్ని లాజిక్స్ సినిమాలో మిస్ అయ్యాయి. ఆ లాజిక్స్ ఎందుకు మిస్ అయ్యారు.?

స) నా దృష్టిలో హిట్ సినిమా అయినా, ఫ్లాప్ సినిమా అయినా లూప్ హోల్స్ మాత్రం కామన్ గా ఉంటాయి. అది శంకర్ తీసిన మరే పెద్ద డైరెక్టర్ తీసినా ఆ లాజికల్ తప్పులు ఉంటాయి. మన సినిమాలో లాజికల్ గా తప్పులు ఉండచ్చు కానీ ఎమోషనల్ గా తప్పులు ఉండకూడదు. అంటే హీరో.. ఈ సినిమాలో హీరో పాత్రకి కనెక్ట్ అయిపోతాం కాబట్టి ఆడియన్స్ లాజిక్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. అందుకే మేము కూడా ఎమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాము.

ప్రశ్న) ఈ సినిమా రైట్స్ పై పలు వివాదాస్పద వార్తలు వస్తున్నాయి. దానిపై మీ కామెంట్.?

స) హిట్ సినిమా అయితేనే ఇలాంటి వివాదాలు, కంప్లైంట్స్ రావడం సెటిల్ మెంట్స్ జరగడం కామన్. అదే ఫ్లాప్ అయితే ఎవరూ పట్టించుకోరు. నాకు తెలిసి మళయాళ రీమేక్ రైట్స్ తీసుకొని ఈ సినిమా చేసాం. దీనికన్నా అంటే నాకు తెలియదు.

ప్రశ్న) ఇప్పటి వరకూ ఎక్కువగా లవ్ ఎంటర్టైనర్స్ కి డైలాగ్స్ కి రాసిన మీరు మొదటి సారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ డైలాగ్స్ రాయడం ఎలా ఉంది.?

స) ఒక రైటర్ అన్నాక ఎలాంటి సినిమాలకి అన్నా డైలాగ్స్ రాయగలగాలి. మామూలుగా నాకు హార్ట్ ఫుల్ ఫీలింగ్స్ తో డైలాగ్స్ రాయడం ఇష్టం. అలాంటి డైలాగ్స్ ఇందులో రాయడం చాలా బాగా అనిపించింది.

ప్రశ్న) ‘రొమాన్స్’ ఫ్లాప్ తర్వాత మళ్ళీ డైరెక్షన్ వైపు వెళ్ళలేదా? మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?

స) ‘రొమాన్స్’ ఫ్లాప్ అవ్వడానికి కారణం నాకు భూతు రాకపోవడం. ఎవరికైనా తనకి రాణి సబ్జెక్ట్ ని డీల్ చేస్తే ఇలానే అవుతుంది. ప్రస్తుతం ఓ సినిమాకి డైరెక్షన్ చేసే ఆలోచనలో ఉన్నాను, అలాగే మరో పెద్ద సినిమాకి డైలాగ్స్ రాసే అవకాశం కూడా వచ్చింది. కానీ ప్రస్తుతానికి నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలా అనే ఆలోచనలో ఉన్నాను. త్వరలో ఈ విషయంపై క్లారిటీ ఇస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు