చిట్ చాట్ : శౌర్య – నాగార్జున గారి ‘నిన్నేపెళ్ళాడతా’ లాంటి సినిమా చేయడమే నా డ్రీం.!

చిట్ చాట్ : శౌర్య – నాగార్జున గారి ‘నిన్నేపెళ్ళాడతా’ లాంటి సినిమా చేయడమే నా డ్రీం.!

Published on Jun 24, 2014 5:53 PM IST

Nagasourya

గత శుక్రవారం విడుదలైన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ద్వారా మంచి నటనని కనబరిచి మంచి మార్కులు కొట్టేసిన యంగ్ హీరో శౌర్య. ‘చందమామ కథలు’ తర్వాత తను ఫుల్ లెంగ్త్ హీరోగా చేసిన సినిమా ‘ఊహలు గుసగుసలాడే’. ఈ సినిమా విజయంతో ఆనందంగా ఉన్న శౌర్యతో కాసేపు ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) మీకు ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?

స) సినిమా ఆఫర్స్ కోసం తిరిగి తిరిగి ఇక నాకు అవకాశం రాదు అనుకున్న టైంలో చివరి చాన్స్ గా ఈ సినిమా కాస్టింగ్ కాల్ యాడ్ చూసి నా ఫొటోస్ పంపాను. బాగున్నాయని రమ్మన్నారు. ఆ తర్వాత ఒక 15 రోజులపైనే చాలా మందితో కలిపి ఆడిషన్స్ చేసారు. ఆడిషన్స్ పూర్తైన కొద్ది రోజుల తర్వాత కాల్ చేసి ఆఫీసు కి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళాక నువ్వే హీరో అని చెప్పి పూజా కార్యక్రమాలు చేసారు. అలా నాకు ఈ అవకాశం వచ్చింది. ముందు నేను ఈ సినిమాకి సైన్ చేసినా ‘చందమామ కథలు’ ముందు రిలీజ్ అయ్యింది.

ప్రశ్న) కెమెరా ముందు మొదటి అనుభవం ఎలా అనిపించింది? ఈ సినిమాలో మీకు బాగా ఇష్టమైన మరియు టఫ్ సీన్స్ ఏంటో చెప్పండి?

స) గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో ఆడిషన్స్ లో పాల్గొన్నాను. అలాగే ఈ చిత్ర టీంతో కలిసి 20 రోజులు వర్క్ షాప్ చేసాను. అందువల్ల కెమెరా ముందు పెద్దగా ఇబ్బంది పడలేదు. నాకు బాగా ఇష్టమైన సీన్ అంటే ఒక అబ్బాయిగా నేను వెళ్లి అమ్మాయికి ఐ లవ్ యు చెప్పే సీన్. అలాగే టఫ్ సీన్ అంటే ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యు చెబుతుంటే రిజెక్ట్ చేయడం కష్టం. అది నాకు టఫ్ గా అనిపించింది.

ప్రశ్న) థియేటర్స్ లో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?

స) మేము రోజూ ఏదో ఒక థియేటర్ కి వెళ్తున్నాం. అందరూ బాగా నవ్వుతున్నారు. చూసిన వారంతా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత భూతు లేకుండా బాగా నవ్వించారు. సినిమా ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉందని అంటున్నారు. అలాగే మొదటి రోజు కంటే తర్వాతి రోజుల్లో బాగా పికప్ అవుతోంది.

ప్రశ్న) మీ డ్రీం రోల్స్ గురించి చెప్పండి? అలాగే మీరు పనిచేయాలనుకునే డ్రీం డైరెక్టర్స్ ఎవరన్నా ఉన్నారా?

స) నా లైఫ్ డ్రీం అంటే నాగార్జున గారి కెరీర్లో మైలురాయిగా నిలిచిన ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా ‘నిన్నేపెళ్ళాడతా’ లాంటి సినిమా నా కెరీర్లో చేయాలని ఉంది. ఇక డైరెక్టర్స్ అంటే అందరితోనూ అన్ని తరహా సినిమాలు చేయాలనుకుంటున్నాను.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి?

స) ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో ఒకటి సాయి కొర్రపాటి గారి ప్రొడక్షన్ లోనే ఎస్ఎస్ రాజమౌళి కో డైరెక్టర్ కోటి డైరెక్షన్ లో ‘దిక్కులు చూడకు రామయ్య’. ఇక రెండవది అవికా గోర్ నటిస్తున్న ‘లక్ష్మీ రావే మాఇంటికి’ సినిమాలో హీరోగా నటిస్తున్నాను.

ప్రశ్న) ముందు ముందు శౌర్య నుంచి ఎలాంటి సినిమాలు ప్రేక్షకులు ఆశించవచ్చు?

స) నా వరకూ నన్ను చూసి రాకూడదు. నా సినిమాలోని కథని చూసి ఆడియన్స్ థియేటర్ కి రావాలి. ఎందుకంటే ఎప్పుడైనా కథే సినిమాకి హీరో. ఈ సినిమాలో శౌర్య ఎలాంటి కథ చేసాడో అనుకొని ఆడియన్స్ థియేటర్ కి రావాలి. కథ వినేప్పుడు నేను కనెక్ట్ అయితే సినిమా చేస్తాను. నాకే కనెక్ట్ కాపోతే ఆడియన్స్ కి అస్సలు కనెక్ట్ కాదుగా..

అంతటితో శౌర్యకి ఆల్ ది బెస్ట్ చెప్పి మా చిట్ చాట్ ముగించాం..

 

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు