చిట్ చాట్ : రణధీర్ – ఏ సినిమాకైనా కథే హీరో.!

చిట్ చాట్ : రణధీర్ – ఏ సినిమాకైనా కథే హీరో.!

Published on May 9, 2014 5:00 PM IST

ranadeer

‘హ్యాపీ డేస్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు రణధీర్. సినిమా హిట్ అయినా లేదా ఫ్లాప్ అయినా మొదటి నుంచి తనకి వచ్చిన పాత్రలకి పూర్తి న్యాయం చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రణధీర్ కీలక పాత్ర పోషించిన ‘ఏప్రిల్ ఫూల్’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రణధీర్ చెప్పిన విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

స) ‘హ్యాపీ డేస్’ సినిమా చేసే టైం నుంచే నాకు నటన పరంగా చాలెంజింగ్ పాత్రలు చేయాలని ఉండేది. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. చాలా చాలెంజింగ్ రోల్ చేసాను అది కూడా ఒక హీరోగా..

ప్రశ్న) జగపతి బాబు, భూమిక, గుల్షన్ గ్రోవర్ లాంటి సీనియర్స్ తో నటించడం ఎలా అనిపించింది?

స) వీరు ముగ్గురు ఇండస్ట్రీలో చాలా టాలెంట్ ఉన్న నటులు. అలాంటి వారితో పనిచేయడం మరచిపోలేని అనుభవం. సినిమా షూటింగ్ మొదట్లో కాస్త భయపడ్డాను కానీ కొద్ది రోజులకి వారితో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది.

ప్రశ్న) మీరు చేయాలనుకునే డ్రీం రోల్స్ ఏమన్నా ఉన్నాయా?

స) కచ్చితంగా ఇది చెయ్యాలని ఏమీ లేదు. కానీ నటనకి చాలా ప్రాధాన్యం ఉన్నవి, కష్టమైన పాత్రలు చేయాలి మరియు అవి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసేలా ఉన్నాయి.

ప్రశ్న) మీ డైరెక్టర్ శ్రీ కాంత్ తో పనిచేయడం ఎలా ఉంది?

స) డైరెక్టర్ శ్రీ కాంత్ నాకు గురువు లాంటి వారు.. ఈ సినిమా షూట్ చేసే సమయంలో చాలా నేర్పించాడు. ఈ సినిమాలో ఒక సీన్ లో నాకు 6 పేజీల డైలాగ్ ఉంటుంది. ఆ సీన్ టైంలో నాకు చాలా హెల్ప్ చేసాడు. ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి, ఎక్కడ గట్టిగా చెప్పాలి అనేవి నేర్పించి మరీ ఆ సీన్ షూట్ చేసాడు.

ప్రశ్న) మీరు ఒక సినిమాకి సైన్ చేసేటప్పుడు ఏం చూస్తారు?

స) ముందు స్టొరీ నాకు బాగా నచ్చాలి. ఎందుకంటే ఏ సినిమాకైనా హీరో కథే అని నమ్ముతాను. కథ బాగుంటే ఎలాంటి పాత్ర చేయడానికికైనా నేను రెడీ.

ప్రశ్న) ఈ సినిమాలో చేసిన మిగిలిన నటీనటుల గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ధనరాజ్, తాగుబోతు రమేష్ లు కీలక పాత్రల్లో కనిపిస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు