లారెన్స్ ‘గంగ’ రిలీజ్ కి ఉన్న అడ్డంకులేంటో మీకు తెలుసా.?

లారెన్స్ ‘గంగ’ రిలీజ్ కి ఉన్న అడ్డంకులేంటో మీకు తెలుసా.?

Published on Apr 21, 2015 2:57 AM IST

kanchana-2
సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఎదురయ్యే సమస్యల వల్ల సినిమా మొత్తం రెడీ అయినా రిలీజ్ చెయ్యడానికి మాత్రం సంవత్సరాల టైం పడుతుంది. ఇలాంటి సమస్యను ఇప్పటికే పలు సినిమాలు ఫేస్ చేసాయి. తాజాగా ఇదే సమస్యని కొరియోగ్రాఫర్ నుంచి నటుడిగా, దర్శకుడిగా మారి ప్రేక్షకులను మెప్పించిన రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన ‘గంగ’ సినిమా ఎదుర్కుంటోంది. హర్రర్ కామెడీగా వచ్చిన ముని, కాంచన సినిమాలకు ఇది సీక్వెల్. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ సినిమాని తెలుగు బెల్లంకొండ సురేష్ నిర్మించాడు.

ఏప్రిల్ 17న తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో మత్రం రిలీజ్ కాలేదు. దానికి కారణం బెల్లంకొండ సురేష్ ఫైనాన్సియల్ గా ఇబ్బందులు ఎదుర్కోవడమే.. బెల్లంకొండ సురేష్ బ్యానర్ లో వచ్చిన చివరి రెండు సినిమాలు నష్టాలు తేవడంతో ఫైనాన్సియర్స్ వారికి కట్టాల్సిన అమౌంట్ క్లియర్ చేసి తర్వాత సినిమా రిలీజ్ చెయ్యాలని అంటున్నారు. బెల్లంకొండ సురేష్ సుమారు 12 కోట్లు ఫైనాన్సియర్స్ కి క్లియర్ చెయ్యాలని సమాచారం. ఇప్పుడు బెల్లంకొండ సురేష్ ముందు ఉన్న ఏకైక ఛాన్స్ దిల్ రాజు. అందులో భాగంగానే దిల్ రాజుకి గంగ సినిమాని స్పెషల్ గా చూపించారు. దిల్ రాజు ముందుకు వచ్చి ఈ మౌంట్ ని క్లియర్ చేస్తే గంగ సినిమా ఈ నెల 24న రిలీజ్ అవుతుంది. లేదా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం.

మరి అన్నీ క్లియర్ చేసుకొని రిలీజ్ అయ్యేంత వరకూ తెలుగు రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. రాఘవ లారెన్స్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ పాత్ర సినిమాకి హైలైట్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు