‘గంగ'(కాంచన 2) రిలీజ్ ఎప్పుడంటే..!

‘గంగ'(కాంచన 2) రిలీజ్ ఎప్పుడంటే..!

Published on Apr 21, 2015 5:37 PM IST

kanchana-2
హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ‘కాంచన’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ‘ముని’ సినిమాకు సీక్వెల్‌గా ‘కాంచన’ తెరకెక్కగా, ఇప్పుడా సిరీస్‌లో మూడో సినిమా ‘గంగ(ముని 3)’ విడుదల కానుంది. గంగ తమిళ వర్షన్ ‘కాంచన 2’ గత శుక్రవారమే విడుదలై మంచి రివ్యూలను పొందింది. అయితే కొన్ని అనివార్య కారణాలతో తెలుగులో ఇప్పటివరకూ ఈ సినిమా విడుదల కాలేదు.
దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఈ సినిమా ద్వారా మరో హర్రర్ కామెడీని తన ఖాతాలో వేసుకున్నారు.

తెలుగులో ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ విడుదల చేయనున్న విషయం తెలిసిందే. కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై స్పష్టత కరువైంది. ఏప్రిల్ 24న ఈ సినిమా విడుదలకు అంతా సిద్ధమైనట్టు ఇప్పటివరకూ వినిపించినా తాజాగా ఈ సినిమా మే నెలకు షిఫ్టైనట్టు తెలుస్తోంది. మే 1న ఈ సినిమాను విడుదల చేసేందుకు లైన్ క్లియ చేసుకుంటున్నట్లు సమాచారం. తాప్సీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో నిత్యామీనన్ ఓ కీలక పాత్రలో మెరిసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు