‘చుట్టాలబ్బాయి’ విడుదల తేదీ మారింది!

‘చుట్టాలబ్బాయి’ విడుదల తేదీ మారింది!

Published on Aug 1, 2016 3:02 PM IST

CHUTTALABBAYI
లవర్ బాయ్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తోన్న ఆది, తాజాగా ఈసారి కాస్త ఫ్యామిలీ డ్రామాను కూడా మిక్స్ చేసి ‘చుట్టాలబ్బాయి’ సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మొదట ఆగష్టు 5న విడుదలవుతుందని టీమ్ ప్రకటించినా, తాజాగా కొన్ని అనివార్య కారణాలతో సినిమాను ఆగష్టు 13వ తేదీకి వాయిదా వేసింది. స్వాతంత్ర్య దినోత్సవ వారాన్ని పురస్కరించుకొని తమ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచన చేశామని దర్శక, నిర్మాతలు తెలిపారు.

కామెడీ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరభద్రం చౌదరి తెరకెక్కించిన ఈ సినిమా ఆయన గత చిత్రాల్లానే కామెడీ, ఫ్యామిలీ అంశాలను మేళవించుకొని తెరకెక్కిందని సమాచారం. ఆది సరసన నమితా ప్రమోద్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను వెంకట్ తలారి, రామ్ తల్లూరి నిర్మించారు. థమన్ అందించిన ఆడియో ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు