రేపటి నుంచి టాలీవుడ్ షూటింగ్స్ రీస్టార్ట్

రేపటి నుంచి టాలీవుడ్ షూటింగ్స్ రీస్టార్ట్

Published on Oct 22, 2014 3:45 PM IST

TFI
టాలీవుడ్ లో వర్కర్స్ యూనియన్ తమ జీతాలను పెంచాలని గత 10 రోజులుగా చేస్తున్న స్ట్రైక్ నేటితో ముగిసింది. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి మరియు వర్కర్స్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందం వలన వాళ్ళు సమ్మె విరమించారు. దీంతో రేపటి నుంచి అన్ని సినిమాల షూటింగ్ లు తిరిగి మొదలు కానున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు అవుట్ డోర్ షూటింగ్ ని కూడా కాన్సల్ చేసుకొని హైదరబాద్ లోనే ఉన్నారు. అవన్నీ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

ఈ 10 రోజుల స్ట్రైక్ లో ఒక నాలుగు రోజుల నుంచి పోస్ట్ ప్రోదక్సహ్న్ టీం వారు కూడా చేరడంతో స్ట్రైక్ మరింత ముమ్మరం అయ్యింది. దాంతో చిత్ర నిర్మాతలకు లాస్ మరింత ఎక్కువ అవుతుండడంతో తొందరగా ఈ చర్చలను ఫినిష్ చేసి సెటిల్ చేసారు. దీంతో రేపటి నుంచి అన్ని సినిమాల షూటింగ్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పట్టాలెక్కనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు