సుధీర్ బాబు సినిమాకి క్లాసీ టైటిల్ !

సుధీర్ బాబు సినిమాకి క్లాసీ టైటిల్ !

Published on Feb 22, 2018 5:14 PM IST

సుధీర్ బాబు, దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి కలయికలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితమే మొదలైన ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకుంది. సుధీర్ బాబు తన పాత్ర తాలూకు డబ్బింగ్ కూడ మొదలుపెట్టాశారు.

ఈ చిత్రానికి ‘సమ్మోహనం’ అనే క్లాసీ టైటిల్ ను నిర్ణయించారు దర్శక నిర్మాతలు. ఈ పేరును బట్టి చిత్రం రొమాంటిక్, ఫన్ ఎంటర్టైనర్ గా ఉంటుందనుకోవచ్చు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, పిజి. విందా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఇందులో సుధీర్ బాబుకు జోడీగా బాలీవుడు హీరోయిన్ అదితి రావ్ హైదరి నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు