‘సర్దార్’ సెట్లో కామెడీ హంగామా

‘సర్దార్’ సెట్లో కామెడీ హంగామా

Published on Feb 12, 2016 8:29 AM IST

Sardaar
టాలీవుడ్ లో రూపొందుతున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఒకటి. ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, తెలుగు సినీ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారి కోరికని తీర్చేలా ఈ సినిమాని ఫస్ట్ సమ్మర్ రిలీజ్ గా ఏప్రిల్ 8న సినిమాని రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ కి ఎలాంటి ఆటంకం కలగకూడదు అని ఈ చిత్ర టీం జోరుగా షూటింగ్ ని ఫినిష్ చేస్తోంది. ఇటీవలే ఈ చిత్ర టీం కేరళ వెళ్లి వచ్చింది. అక్కడ పవన్ కళ్యాణ్ – కాజల్ అగర్వాల్ లపై ఓ పాటని షూట్ చేసారు.

ఆ పాట షూట్ చేస్కొని వచ్చిన ఈ చిత్ర టీం హైదరబాద్ లో తదుపరి షెడ్యూల్ ని మొదలు పెట్టారు. ప్రసతుతం సర్దార్ సెట్ అంతా నవ్వుల మయమైంది. ఎందుకంటే ప్రస్తుతం సర్దార్ షూట్ లో భాగంగా సినిమాలోని కొన్ని కామెడీ పార్ట్స్ ని షూట్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ కన్నా మించే ఈ సినిమాలో కామెడీ ఉంటుందని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. పవర్ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. లక్ష్మీ రాయ్, సంజనలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాని ఎరోస్ వారు వరల్డ్ వైడ్ రైట్స్ కొనుక్కొని అన్ని ఏరియాల బిజినెస్ కూడా క్లోజ్ చేసేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు